Festival | వైభవంగా పడమటి అంజన్నబ్రహ్మోత్సవాలు

Festival | వైభవంగా పడమటి అంజన్నబ్రహ్మోత్సవాలు
- జ్యోతులతో తరలివస్తున్న భక్తులు
Festival | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో వెలిసిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ స్వామివారి రథోత్సవం(Lord’s chariot festival) సందర్భంగా భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామి వారికి జ్యోతులు మోసీ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మక్తల్ పట్టణంలోని యాదవ్ నగర్, ఆనంపల్లి వీధి, మారుతి నగర్, కేశవ్ నగర్, అంబేద్కర్ నగర్, ఎల్లమ్మ కుంట వంటి ప్రాంతాలతో పాటు వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చి జాతర ప్రాంగణంలో(At the fairgrounds) విడిది చేసిన భక్తులు సామూహికంగా జ్యోతులు మోస్తూ స్వామి వారిని దర్శించుకుంటున్నారు.

జాతర ప్రాంగణంలోనే పిండి వంటలు చేసుకుని నైవేద్యం సమర్పించి దాసంగాలు పెడుతున్నారు. ముంబై, సోలాపూర్, పూణే, అంబర్నాథ్, యాదగిరి, గుల్బర్గా, హైదరాబాద్, ఆదోని వంటి సుదూర ప్రాంతాల నుండి భారీ ఎత్తున భక్తులు(A large number of devotees) తరలివచ్చారు. స్వామి వారి దర్శనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు(difficulties) లేకుండా ఆలయం కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లు చేశారు.
