విద్యుద్ఘాతంతో మ‌హిళ కూలీ మృతి

విద్యుద్ఘాతంతో మ‌హిళ కూలీ మృతి

యాదాద్రి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : విద్యుత్ షాక్ తో ఓ మహిళ కూలీ మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట పట్టణ కేంద్రంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. నకిరేకల్ మండలం గుర్రంకపల్లి గ్రామానికి చెందిన సంపంగి ఆండాలు (50) భర్త తిరుపతితో క‌ల‌సి బ‌తుకుదెరువు నిమిత్తం 15 రోజుల కింద‌ట‌ రాజాపేట మండల కేంద్రానికి వచ్చారు.

కుమ్మరి కుంట వద్ద నివసిస్తూ ఉన్నారు. వృత్తిరీత్యా బండ కొట్టి కూలి పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. రోజులాగే ఉదయం లేచి మంచినీళ్లు నిమిత్తం పక్కనే ఉన్న ఇంటిలో నీళ్ల కోసం వెళ్లగా అడ్డుగా ఉన్న తీగను పైకి లేపింది. ఆ తీగకు విద్యుత్ సరఫరా ఉండ‌దంతో విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందింది.

Leave a Reply