మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..

  • వెలుగులోకి సూసైడ్ లెటర్..

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ధరూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ దివ్య సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దివ్య ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. సంఘటన స్థలంలో లభ్యమైన సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకుని దానిలో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తున్నారు. అయితే, దివ్యను ఎవరైనా వేధించారా? పని సంబంధిత ఒత్తిళ్లు ఉన్నాయా? లేక వ్యక్తిగత కారణాలేనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, ఆమె కుటుంబ సభ్యులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ నిజానిజాలు బయటపడాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తేలియాల్సి ఉంది.

Leave a Reply