కళా ఉత్సవ్ విజేతలకు సత్కారం
కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ : కళా ఉత్సవ్ 2025లో భాగంగా విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమృద్ధి పోటీల్లో శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళి మండలంలోని కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయుడు పి. షణ్ముఖరావు(P. Shanmukha Rao)కు రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. ఇతనికి సహాయక ఉపాధ్యాయుడుగా అదే పాఠశాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు బి. మల్లేశ్వరరావు(B. Malleswara Rao) ఎంపిక అయ్యారు.
కళా సమ్మిళిత విద్యలో భాగంగా డ్రాయింగ్, సింగింగ్, డాన్సింగ్, క్రాఫ్టింగ్, పప్పెట్రీ, నటనా కళాశాలలతో కళాత్మకంగా బోధన చేసినందుకుగాను ఎస్.సి.ఇ.ఆర్.టి.(S.C.E.R.T) డైరెక్టర్ ఎం. వెంకట కృష్ణారెడ్డి చేతుల మీదుగా వీరిరువురూ బహుమతులు అందుకున్నారు. వీరు నవంబర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలలో రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. వీరికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

