హైదరాబాద్ – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల సింగపూర్ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో సింగపూర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మార్క్ శంకర్‌ను కాపాడిన వారిని సత్కరించింది.
కాగా, ఈ ప్రమాదంలో చిక్కుకున్న 16 మంది చిన్నారులను, ఆరుగురు పెద్దవారిని అక్కడి భారతీయ ప్రవాసులు కాపాడారు. వారందరినీ తాజాగా సింగపూర్ ప్రభుత్వం సత్కరించింది. ఈ నెల 8న ప్రమాదం జరిగిన సమయంలో భవనంలోని మూడో అంతస్తు నుంచి పొగలు రావడం, చిన్నారుల అరుపులు విన్న నలుగురు భారతీయ కార్మికులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని రక్షించారని ప్రభుత్వం తెలిపింది.
వారి ప్రాణాలను లెక్కచేయకుండా చిన్నారులను కాపాడినందుకు సత్కరించినట్లు పేర్కొంది. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ఇంటికి చేరుకుని, కోలుకుంటున్న విషయం తెలిసిందే. తమ తనయుడు కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ బాలుడి పెద్దనాన్న చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అటు అభిమానులు కూడా పవన్ తనయుడు క్షేమంగా తిరిగి రావడంతో హర్షం వ్యక్తం చేశారు.
మాట్లాడుతున్న శంకర్
మార్క్ శంకర్ ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడుతున్నదని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఊపిరితిత్తులలోకి పొగ వెల్లడం వల్ల ఇంకా ఆక్సిజెన్ మాస్క్ ను కంటిన్యూ చేస్తున్నామన్నారు.. నిరంతరం వైద్యుడు అతడిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం మార్క్ నడుస్తున్నాడని, అలాగే మాట్లాడుతున్నాడని వెల్లడించారు.. మరో నాలుగైదు రోజులు సింగపూర్ లో ఉంటామని, తర్వాత వైద్యులు సూచనలతో హైదరాబాద్ కు తీసుకువస్తామని చెప్పారు.. కాగా, పవన్ తో వెళ్లిన చిరంజీవి దంపతులు అక్కడే ఉన్నారు. మరో రెండు రోజులు వారు అక్కడే ఉండనున్నట్లు సమాచారం .