అంగన్ వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన

మోత్కూర్, ఆంధ్రప్రభ ; మున్సిపాలిటీ పరిధిలోని 9 వ వార్డ్ కొండాపురం లోని అంగన్ వాడీ కేంద్రాన్ని శుక్రవారం కౌన్సిలర్ బీసు శ్రీకాంత్ గౌడ్ సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులకు నిర్వహించిన అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు ఫ్యాన్ లేకపోవడంతో ఉక్కపోతగా ఉందని టీచర్ సువర్ణ కౌన్సిలర్ కి చెప్పడంతో తక్షణమే ఫ్యాన్ ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు బీసు రవి, నీల వెంకటేశం , మన్నె మల్లయ్య, బీసు ప్రశాంత్ , మన్నె రామచంద్రయ్య, నవీన్, బాలకృష్ణ, బీసు చందు మొలకల వెంకటేశం,బబ్బురి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply