ADB | రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతురు మృతి…!

ఆంధ్రప్రభ బ్యూరో, ఆదిలాబాద్ : నిర్మల్ జిల్లా నీలాయపేట జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన తండ్రి, కూతురు దుర్మరణం చెందారు. ఆదిలాబాద్ రవీంద్ర నగర్ కాలనీకి చెందిన బ్యాటరీ వ్యాపారి బండి శంకర్ (49) హైదరాబాదులో బీటెక్ చదువుతున్న కూతురు కృతికను (21) తీసుకురావడానికి టియాగో కారులో డ్రైవర్ తో కలిసి హైదరాబాద్ వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో కారు డ్రైవర్ కు నిద్ర రావడంతో కాసేపు డ్రైవర్ ను వెనుక సీట్లో కూర్చోబెట్టి, తన కూతురు కృతికను ముందు సీట్లో కూర్చోబెట్టి బండి శంకర్ డ్రైవింగ్ చేస్తుండగా నీలాయిపేట వద్ద ఎదురుగా వస్తున్నడీసీఎం వాహనం ఢీకొట్టింది. దీంతో తండ్రి కూతురు ఇద్దరూ అక్కడికక్కడే మృతించారు. కారు డ్రైవర్ తో పాటు డీసీఎం డ్రైవర్ కు కూడా గాయాలయ్యాయి. మృతిచెందిన శంకర్ కు ఇద్దరు కవల ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. తండ్రి కూతుర్లు ఇద్దరూ మృతిచెందిన సంఘటన రవీంద్ర నగర్ కాలనీలో తీరని విషాదం నింపింది. నిర్మల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *