ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం..

  • ఒంటెద్దు బండిని ఢీకొన్న బైక్..
  • భార్య, మరో తనయకు తీవ్ర గాయాలు

ఆంధ్రప్రభ, భట్టిప్రోలు : ఎదురుగా వెళ్తున్న ఒంటెద్దు బండిని ఓ బైక్ ఢీకొనటంతో తండ్రీ బిడ్డ దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం ప్రశాశం జిల్లా భట్టిప్రోలు మండలం, కన్నెగంటి వారి పాలెం…గోరిగపూడి గ్రామాల మధ్య జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రేపల్లె మున్సిపల్ గ్రీన్ అంబాసిడర్ పారిశుద్ధ్య కార్మికుడు చొక్కాకుల నాగసాయి , తన భార్య రాజేశ్వరి, ఇద్దరు కుమార్తెలు పల్లవి, వేదశ్రీ తో కలిసి శనివారం సాయంత్రం రేపల్లె నుంచి తమ బైక్ పై బాపట్ల వెళ్తున్నారు. తమ ముందు వెళుతున్న ఒంటెద్దు బండిని ఢీ కొట్టగా నాగసాయి (27) పల్లవి (2) అక్కడికక్కడే మృతి చెందారు . భార్య రాజేశ్వరి, చిన్న కుమార్తె వేదశ్రీ ని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రాజేశ్వరి ఫిర్యాదు మేరరే కేసును ఎస్ఐ శివయ్య నమోదు చేశారు.

Leave a Reply