- నార్కెట్‌పల్లి పీఏసీఎస్ వద్ద రైతులు పడిగాపులు
ఉమ్మడి నల్లగొండ బ్యూరో : బస్తా యూరియా కోసం రైతులు కుస్తీ పడుతున్నారు. గురువారం నల్లగొండ (Nalgonda ) జిల్లా నార్కెట్ పల్లి పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు (Farmers) బారులు తీరారు. నార్కెట్ పల్లి పీఏసీఎస్‌కు 440 బస్తాల యూరియా వచ్చింది. సమాచారం అందిన వెంటనే ఒక్కసారిగా రైతులు పీఏసీఎస్ (PACS) వద్దకు చేరుకున్నారు. క్యూలో నిలబడలేక కొంతమంది రైతులు చెప్పులు, టవల్స్ వేశారు.
ఒక్కో రైతుకు బస్తా యూరియా..
తగినంతగా యూరియా సరఫరా కాకపోవడంతో ఒక్కో రైతుకు బస్తా యూరియా (Urea) మాత్రమే పంపిణీ చేశారు. 20 ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఐదు బస్తాలు కంటే ఎక్కువ యూరియా ఇవ్వడం లేదు. రైతుల (Farmers) అవసరాలకు సరిపడా యూరియాను అందించాలని రైతులు డిమాండ్ చేశారు.