రైతులను ఆదుకోవాలి
నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : తుఫాను, వరద వల్ల నష్టపోయిన రైతుల(Farmers)ను ఆదుకోవాలని కోరుతూ రైతాంగం ధర్నాచేపట్టింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట(Nagireddypet) మండలంలో రైతులు ధర్నాచేశారు.
ధర్నాలో పాల్గొన్నఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్(Surender) మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, నిజాంసాగర్ బ్యాక్ వాటర్(Backwater) వల్ల నాగిరెడ్డిపేట మండలంలో ఐదు వేల ఎకరాల్లో పంటలు ముంపుకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వెంటనే ముంపు సమస్యను పరిష్కరించి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల నష్ట పరిహారం(compensation) చెల్లించాలని డిమాండ్ చేశారు.

