Fertilizer | యాప్ పై రైతులకు అవగాహన కల్పించాలి

Fertilizer | యాప్ పై రైతులకు అవగాహన కల్పించాలి

  • రాష్ట్ర వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ నరసింహారావు

Fertilizer | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : రైతులకు “ఫెర్టిలైజర్ బుకింగ్ యూరియా” యాప్ పై విస్తృతంగా అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ నరసింహారావు డీలర్లకు సూచించారు. ఇవాళ ఆయన చిట్యాలలో గ్రోమోర్ సెంటర్(Gromore Center)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

యూరియా యాప్ పై రైతులకు ఎంతవరకు అవగాహన ఉందో తెలుసుకోవడంలో భాగంగా రైతులతో నేరుగా యూరియా యాప్ ద్వారా బుకింగ్ చేసే విధానం, సేఫ్ టు బై సేఫ్టీ(Safe to Buy Safety) ప్రాసెస్ ను అడిగి తెలుసుకున్నారు. యాప్ ద్వారా రైతులకు పారదర్శకత, అకౌంటు ఆధారిత యూరియా సరఫరా జరుగుతున్నదని రైతులకు వివరించారు. గ్రోమోర్ సెంటర్ అందిస్తున్న సేవలను తెలుసుకొని అభినందించారు. జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్, మార్కెటింగ్ మేనేజర్ రత్నం, సునీల్, గ్రోమోర్ సెంటర్ మేనేజర్ శేషన్న, అధికారులు ఉన్నారు.

Leave a Reply