దండేపల్లి, ఆగస్టు 30(ఆంధ్రప్రభ): రైతుల పరిస్థితి నేడు మళ్ళీ నాటి ఉద్యమాలను గుర్తు చేస్తోంది. పచ్చని పొలాల్లో పంటలు వాడిపోతూ ఉంటే, రైతులు మాత్రం యూరియా (Urea) కోసం శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) లోని దండేపల్లి మండలంలోని గూడెం సహకార సంఘం, నెల్కివెంకటాపూర్ సహకార సంఘం దగ్గర రైతులు ఉదయం నుండి క్యూ లైన్లలో నిలబడి పడిగాపులు కాస్తున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నారు.
స్వతంత్ర దేశంలో, స్వయం పాలన కలిగిన రాష్ట్రంలో రైతులు (Farmers) ఈ స్థితికి చేరడం ఎంత అవమానకరమో అన్నారు. ఎన్నికల ముందు ప్రజల ఇళ్ల వద్దకు వచ్చి మేమున్నాం రైతుల కోసం అంటూ ప్రగల్భాలు పలికిన నాయకులు నేడు ఎక్కడున్నారని రైతులు నిలదీస్తున్నారు. కుర్చీలెక్కిన తరువాత ఈ రైతు బిడ్డల గోసలు కనపడవా, పల్లెల మట్టిని ముద్దాడిన రైతుల చెమట వాసన ఈ నాయకుల (leaders) కు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.