అడ్డుకున్నపోలీసులను నెట్టివేసిన రైతులు

  • ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో రైతన్నలకు తీరని కష్టం
  • సమగ్ర అంచానాలను రూపొందించడంలో వ్యవసాయ అధికారుల వైఫల్యం
  • యూరియా కొరతతో కట్టలు తెంచుకున్న రైతుల ఆగ్రహం
  • బీబీపేట మండల సొసైటీని ముట్టడించిన రైతులు

బీబీపేట, ఆంధ్రప్రభ : బీబీపేట మండల వ్యాప్తంగా యూరియా కొరత తీవ్రస్థాయి(Extreme)లో ఉండడంతో యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల వ్యాప్తంగా ఉన్న రైతులు బీబీపేట మండల కేంద్రంలోని సొసైటీ కేంద్రం వద్ద గత వారం, పది రోజుల నుండి యూరియా కొరకు ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి 7 గంటల వరకు వేచి ఉంటున్నప్పటికీ తగినంత యూరియా నిలువలు లేకపోవడంతో, బీబీపేట సహకార సంఘం వద్ద యూరియా కావాలని రైతులు పట్టు పట్టడంతో ఏం చేయాలో తెలియక సొసైటీ అధికారులు(society officials), పాలకవర్గం తల పట్టుకున్నారు.

ఒక్కసారిగా వేల మంది బీబీపేట సహకార సంఘం దగ్గరికి యూరియా కొరకు రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం తెలుసుకున్నబీబీపేట పోలీసులు బీబీపేట సొసైటీ కార్యాలయాని(BBpet society office)కి ఎస్సై ప్రభాకర్‌తో పాటు, వారి సిబ్బందితో రైతులను నియంత్రించడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా రైతులు పోలీసులపై తిరగబడ్డారు. ఊహించిన దానికంటే రైతులు యూరియా(urea) కోసం ఒక్కసారిగా రావడంతో స్వల్ప ఉద్రిక్తతల నడుమ బీబీపేట పోలీసులు రైతులను పోలీస్ స్టేషన్ వద్ద యూరియాకు సంబంధించి టోకెన్లు పంపిణీ చేస్తామని తెలపడంతో, వేలాది మంది రైతులు(thousands of farmers) పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చి యూరియా టోకెన్ల కోసం ఎదురుచూశారు.

ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా ఉన్నవివిధ గ్రామాల రైతులు మాట్లాడుతూ.. గడిచిన 10,15 రోజుల నుండి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుండి సొసైటీ కార్యాలయానికి వస్తున్నామని, రాత్రి పొద్దు పోయేవరకు వరుసలో నిలబడినప్పటికీ యూరియా లభించకపోవడంతో, పంటలు నష్టపోయే(loss) పరిస్థితి దాపురించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదేవిధంగా శనివారం వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున బీబీపేట సహకార సంఘానికి యూరియా కొనుగోలు చేద్దామని సొసైటీ కి చేరుకున్నామని, సొసైటీ అధికారులు(Society officials) యూరియా విషయంలో సరైన సమాచారం ఇవ్వకపోవడంతో గందరగోళానికి గురైన రైతులు ఒక్కసారిగా సహనం కోల్పోయి సొసైటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత(Tension) వాతావరణం నెలకొనడంతో, పోలీసులు వచ్చి తమను బీబీపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో కూర్చోబెట్టి యూరియా టోకెన్లు పంపిణీ చేస్తామని చెప్పడంతో వేలాది మంది రైతులు బీబీపేట పోలీస్ స్టేషన్ లోపల, బయట భారీ స్థాయిలో రైతులు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్(Police station) వద్దకు రావడంతో పోలీస్ స్టేషన్ ఆవరణలో సైతం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

ఇన్ని సంవత్సరాలలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని రైతులను పోలీస్ స్టేషన్కు తరలించి యూరియా టోకెన్లు పంపిణీ చేయడం ఎంతవరకు సమంజసం అని వివిధ గ్రామాల రైతులు బీబీపేట సొసైటీ అధికారులతో పాటు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు పంట పొట్ట దశలో ఉందని ఈ సమయంలో యూరియా వరి పంటతో పాటు ఇతర పంటలకు చల్లకపోతే వరి పంట పొట్ట దశలోనే పాడైపోతుంది(Will be damaged) అని, వరి పంట ఏపుగా పెరగకపోవడంతో పాటు, దిగుబడి రాక తీవ్ర నష్టాల పాలవుతామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశానికి అన్నం పెట్టే రైతులను పోలీస్ స్టేషన్ ఆవరణలో క్రింద కూర్చోబెట్టి టోకెన్లు పంపిణీ చేస్తామనడం ఎంతవరకు సమంజసం అని వివిధ గ్రామాల రైతులు పోలీసులతో పాటు, సొసైటీ అధికారులను, వ్యవసాయ అధికారులను, ప్రభుత్వాన్ని నిరదిస్తున్నారు. ఇది ఇలా ఉండగా సహకార సంఘం సీఈఓను యూరియా కొరతపై ఆంధ్రప్రభ సంప్రదించగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తగినంత యూరియా రైతులకు సరఫరా చేశామని తెలిపారు.

అయినప్పటికీ రైతులు యూరియా కొరకు వేలాదిమందిగా ఒక్కసారిగా సొసైటీ ఆవరణలోకి వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులకు సమాచారం అందించామని, పోలీసుల సహకారంతో యూరియా టోకెన్లు పంపిణీ చేయాలని ప్రయత్నించగా కొంత మంది రైతులు ఉద్రిక్తత పరిస్థితి కలగజేస్తుండడంతో, వెంటనే బీబీపేట పోలీస్ స్టేషన్‌(Police station)కు సమాచారం అందించామని ఆంధ్రప్రభతో తెలిపారు.

వెంటనే స్పందించిన బీబీపేట ఎస్సై వారి సిబ్బందితో పరిస్థితి అదుపుతప్పుతుందని భావించి, బీబీపేట పోలీస్ స్టేషన్లో యూరియా టోకెన్ల పంపిణీ చేస్తామని చెప్పడంతో ఒక్కసారిగా వేలాదిమంది రైతులు బీబీపేట సొసైటీ కేంద్రం నుండి ఒక్కసారిగా బీబీపేట పోలీస్ స్టేషన్కు తరలి రావడంతో బీబీపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.

ఈ విషయమై ఆంధ్రప్రభ తో బీబీపేట ఎస్సై ప్రభాకర్ మాట్లాడుతూ, బీబీపేట సహకార సంఘం వద్ద రైతులు అధిక సంఖ్యలో యూరియా కొరకు రావడంతో సహనం కోల్పోయిన రైతులు కొంత ఇబ్బందులు పడ్డారని వారిని సముదాయించే క్రమంలో కొంతమంది రైతులు తొక్కిసలాటకు ప్రయత్నించారని తెలిపారు.

వెంటనే అప్రమత్తం అయినా మా సిబ్బంది పోలీస్ స్టేషన్‌లో యూరియా పంపిణీ టోకెన్లు క్రమసంఖ్యలో రైతులకు పంపిణీ చేస్తామని చెప్పడంతో పోలీస్ స్టేషన్‌కు రైతులను రావలసిందిగా కోరామని ఆంధ్రప్రభకు(Andhraprabhaku) బీబీపేట ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు.

ప్రస్తుతం సాగవుతున్నపంటలకైన సక్రమంగా యూరియా సరఫరా చేయాలని బీబీపేట మండల రైతులు సొసైటీ అధికారులను, పాలకవర్గాన్ని, ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రైతులకు తగినంత యూరియాను అందుబాటులో ఉంచాలని, ఏ గ్రామానికి ఎంత యూరియా అవసరమో ఆ గ్రామానికి అవసరం మేరకు యూరియాను సరఫరా చేయాలని మండల రైతులు కోరుతున్నారు.

లేకపోతే మండల వ్యాప్తంగా వరి పంటలతో పాటు, మిగతా పంటలు సైతం చేలల్లోని నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని, ఈ నష్టానికి పూర్తి బాధ్యత సొసైటీ పాలకవర్గం, సొసైటీ అధికారులు వ్యవసాయ అధికారులతో పాటు, ప్రభుత్వమే తీసుకోవాలని వివిధ గ్రామాల మండల రైతులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీబీపేట మండల రైతులు, వివిధ గ్రామాల ప్రజలు, వ్యవసాయ సహకార సంఘం అధికారులు, బీబీపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రభాకర్ తోపాటు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply