నర్సింహులపేట, ఆంధ్రప్రభ : నర్సింహులపేట (Narsimhulapet) మండలంలో వారం రోజులుగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు నర్సింహులపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (Agricultural Co-operative Society) వద్ద తెల్లవారుజాము నుండే రైతులు నిలబడలేక చెప్పులను వరుసలో ఉంచారు. పీఏసీఎస్ (PACS) కు 900 బస్తాల యూరియా రావడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. పాత టోకెన్లకు యూరియా (Urea) పంపిణీ చేస్తూ.. కొత్తవారికి టోకెన్లను ఇస్తున్నారు.

నిలబడే ఓపిక లేక మహిళా రైతులు (Farmers) అవస్థలు పడుతున్నారు. వేకువ జామున వచ్చిన రైతులకు ఇంటి దగ్గర నుండి సద్ది అన్నం పంపిస్తున్నాను. కనీసం తాగడానికి నీళ్లను కూడా అధికారులు సమకూర్చడం లేదు. యూరియా కష్టాలు(Urea problems) ఎప్పుడు తీరుతాయోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
