భూపాలపల్లి ప్రతినిధి, ఆంధ్రప్రభ : దసరా, బతుకమ్మ ఆటలు, ప్రతి రైతు ఇంటా సందడిగా ఉంటుందని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, యూరియా కోసం పడిగాపులు కాసినప్పటికే సరిపోతుందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు.
ఆదివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులు యూరియా కోసం ఉదయం నుండి బారులు తీరిన విషయం తెలుసుకున్న ఆయన అక్కడకు చేరుకున్నారు. పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్‌తో మాట్లాడి ఒక్క పద్ధతి ప్రకారం రైతులకు యూరియా పంపిణీ చేయాలని కోరారు.
జంగేడు పీఏసీఎస్‌కు 500 యూరియా బస్తాల వస్తే రైతులు వెయ్యి మందికి పైగా ఇక్కడ వేచియున్నారన్నారు. ప్రతి రోజు ఇదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ యూరియా బస్తాలు అందేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.