Farmer’s Day | రైతులకు దిగుబడి రావాలన్నదే మా ఉద్దేశం

Farmer’s Day | రైతులకు దిగుబడి రావాలన్నదే మా ఉద్దేశం

  • జైనూర్‌లో రైతు దినోత్సవ వేడుకలు
  • నూతన సర్పంచులను సన్మానించిన ఎన్జీవో ఉద్యోగులు

Farmer’s Day | జైనూర్, ఆంధ్రప్రభ : రైతులు పండించే పంటలకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి రావాలన్నదే మా భారతి అగ్రికల్చర్ కన్సల్టెన్సీ ఎన్జీవో ఉద్దేశమని ఆ ఎన్జీవో డివిజన్ కోఆర్డినేటర్ గేడం జలపత్ రావు అన్నారు. ఈ రోజు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో రైతు దినోత్సవ సందర్భంగా నూతన సర్పంచులు నాయకులతో, రైతులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా భారతి అగ్రికల్చర్ కాన్స్టెన్సీ ఎన్జీవో డివిజన్ కోఆర్డినేటర్ జలపత్ రావు మాట్లాడుతూ… రైతులు తమ పంట భూముల మట్టిని పరీక్షించుకోవాలని దాని ద్వారా ఎంత మోతాదులో యూరియా, డీఏపీలు, మందులు వాడే పరిస్థితులు తెలుసా అని అన్నారు. తమ ఎన్జీవో ద్వారా రైతుల పంట మట్టిని పరీక్షించి రైతులకు కార్డులు అందిస్తామని, మట్టి నమూనా అలా పరీక్షల ద్వారా ఆ భూమిలో ఎంత శాతం నత్రజని ఇతర లవజనాలు ఉన్నాయని తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

రైతులు తమ పంట భూముల మట్టి నమూనాలను పరీక్షించుకున్న రైతులకు హెల్త్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఒక్కసారి పంట భూముల మట్టిని పరీక్షించుకుంటే రెండు మూడు సంవత్సరాలు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. తమ ఎన్జీవో జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్, కేరమేరి, నాలుగు మండలాల్లో పనిచేస్తుందని ఎన్జీవో లో పనిచేస్తున్న ఉద్యోగులు మట్టి నమూనా పరీక్షలు పంటల సాగుపై తీసుకోవాల్సిన విశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారని ఆయన పేర్కొన్నారు. తమ ఎన్జీవో ద్వారా ఉత్తమ రైతుగా జై నూర్ సోను పటేల్ గూడ కు చెందిన ఆత్రం రామును ఎంపిక చేసి ఆ రైతుకు సన్మానం చేశారు.

Farmer's Day

అనంతరం జైనూర్ లో నూతన సర్పంచులుగా గెలుపొంది బాధ్యతలు స్వీకరించిన జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ కొడప ప్రకాష్, దుబ్బగూడనూతన సర్పంచ్ మడావి కౌసల్య భీమ్రావు, పానపటార్ సర్పంచ్ ఆత్రం తులసి శంకర్, రావుజిగూడ సర్పంచ్ జాదవ్ బాహురావు, తో పాటు కొమరం భీం అసిఫాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్ రావు, బి ఆర్ఎస్ పార్టీ జైనూర్ మండల అధ్యక్షుడు ఇంతియాజ్ లాల లకు శాలువాలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ అగ్రికల్చర్ కన్సల్టెన్సీ ఎన్జీవో డివిజన్ కోఆర్డినేటర్ జలపత్ రావు, సబ్ కోఆర్డినేటర్ ముంజం పవిత్ర, మేనేజ్మెంట్ అధికారి యు సంధ్య, ఫీల్డ్ అసిస్టెంట్లు కుడిమెత వినోద్, కే వేణు, సోంజి,ఏ పవన్, సుదర్శన్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply