రైతులకు యూరియా అగచాట్లు

  • సంగమేశ్వరంలో..విచిత్ర దృశ్యం


(ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి) : తాగుతా నీయబ్బ తాగుతా.. తాగుబోతు నాయాళ్ల తల్లో దూరెల్లుతా.. తాగని నా కొడుకెందుకు లోకంలో.. ఈ సూక్తిని వంటబట్టించుకున్న ఓ సచివాలయ ఉద్యోగి (Secretariat employee) తన సహజ లక్షణాన్ని పాటించాడు. ఎంచక్కా మందేసి మంచిగా బండిపై తూలుతూ ఆఫీసుకు వచ్చాడు. రాత్రి తాగింది దిగకపోవటంతో మళ్లీ పొద్దున్నే ఓ పెగ్గు గుటుకేసి రైతుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. తూలుతూ తూగుతూ వెర్రి వేషాలు వేయటంతో రైతుల కోపం కట్టలు తెంచుకుంది. ఈ ఘటన కృష్ణా జిల్లా (Krishna District) అవనిగడ్డ. నియోజకవర్గం నాగాయలంక మండలం సంగమేశ్వరం గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. అసలు ఏమి జరిగిందంటే, బాణావతు వెంకన్న స్వామి నాయక్ (Banavathu Venkanna Swamy Nayak) సంగమేశ్వరం సచివాలయంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు.

మంగళవారం ఉదయమే తప్పతాగి విధులకు హాజరయ్యారు. ఈ ఉద్యోగి గడిచిన కొద్ది రోజులుగా మందు కొట్టి విధులకు హాజరవుతున్నాడు. సంబంధిత శాఖ అధికారులు (Officials of concerned department) కనీసం పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఉదయం సంగమేశ్వరం (Sangameshwaram) లో రైతులకు యూరియా పంపిణీ చేయాలి. యూరియా కోసం రైతులు రైతు సేవా కేంద్రానికి వచ్చారు. సదరు ఉద్యోగి మద్యం సేవించి విధులకు వచ్చి బయట కూర్చుని రైతులతో మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. ఈ వీడియో తీసిన రైతులు సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియోను మండల వ్యవసాయ శాఖాధికారి ఏ.సంజీవ్ కుమార్ (Sanjeev Kumar) చూసి స్పందించి అతన్ని విధులకు హాజరు కావొద్దని ఆదేశించారు. అతని స్థానంలో మరొకరిని పూరమాయించి రైతులకు యూరియాను అందించారు. వ్యవసాయ శాఖ అసిస్టెంట్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్లు ఏవో తెలిపారు.

Leave a Reply