Farmers | ఆందోళనలో అన్నదాతలు..

Farmers | ఆందోళనలో అన్నదాతలు..

Farmers, బంటుమిల్లి, ఆంధ్రప్రభ : వాతావరణ మార్పుల కారణంగా ధాన్యం కోసిన తర్వాత కనీసం నాలుగు రోజులు ఆరబెడితేనే సరైన రేటు వస్తుంది. కానీ, వర్షాల భయంతో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టకుండానే పరదాలతో కప్పేస్తున్నారు. దీంతో ఆరుదల తగ్గి రేటు పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కోసిన ధాన్యాన్ని కోసినట్టుగా వెంటనే మిల్లులకు తరలించితే తప్పా తాము గట్టెక్కే మార్గం లేదని రైతులు అభిప్రాయపడ్డారు. చలి గాలులు వీస్తుండడంతో తేమశాతం తగ్గలేదని, రహదారులు వెంబడి ధాన్యం ఆరంబోసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం తమను ఆదుకోవాలన్నారు. తేమ శాతం నిబంధనలు సడలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply