రైతు ఆత్మహత్య..

బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలోని ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రైతు గుబిరె రాజయ్య (63) శనివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకొని మరణించాడు. తన ఇంటి ముందున్న రేకుల షెడ్డు లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయన ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply