ఉమ్మడి వరంగల్, మహబూబాబాద్ 14 సెప్టెంబర్ (ఆంధ్రప్రభ) ఉమ్మడి వరంగల్, మహబూబాబాద్(Mahbubabad) జిల్లా, గూడూరు(Gudur) మండలంలోని జాతీయ రహదారి 365 పై రోడ్డు ప్రమాదం జరగగా ఓ రైతు మృతి చెందిగా మరో రైతు పరిస్థితి విషమం ఉన్న సంఘటన ఆదివారం(Sunday) తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. గూడూరు మండలంలోని దుప్పగూడం గ్రామానికి చెందిన ధారావత్ వీరన్న బానోతు లాల్య యూరియా టోకెన్(Urea Token) కోసం బొద్దుగొండ రైతు వేదికకు వెళ్తున్న గ్రామంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు వారు తెలిపారు.

మహబూబాబాద్ నుండి గూడూరు వైపుకు వస్తున్న బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో బానోతు లాల్య అక్కడికక్కడే మృతి చెందగా మరో రైతు పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply