Farmer | యాసంగి పంటకు సాగునీటిని విడుదల చేయాలి…

Farmer | యాసంగి పంటకు సాగునీటిని విడుదల చేయాలి…
- మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు…
Farmer | దండేపల్లి, ఆంధ్రప్రభ : రైతులకు యాసంగి పంటకు తక్షణమే గూడెం లిఫ్ట్ ద్వార తక్షణమే సాగు నీరు అందించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడింపెల్లి దివాకర్ రావు అన్నారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి గూడెం లిఫ్ట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గూడెం లిఫ్ట్ ద్వార దండేపల్లి, లక్షెట్టిపేట హాజీపూర్ మండలాలకు ఒకే జీవన ఆధారం అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉండడం వల్లనే ఇక్కడ రైతులకు బి ఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో మూడు టీఎంసీల లిఫ్ట్ మంజూరు అయిందన్నారు. 2015 నుండి గూడెం లిఫ్ట్ ద్వారా రైతులకు అందిస్తున్నాం అని అన్నారు. గతంలో పెద్ద ఎత్తున వర్షాలు పడడం వలన గూడెం లిఫ్ట్ కు సంబంధించిన కేబుల్స్, తెర పరికరాలు పాడైపోయిన సందర్భంలో దాదాపు 11.50 కోట్ల రూపాయలతో కేబుల్ వెడ్స్, ఇతర పరికరాలను ఏర్పాటుచేసి రెండో పంటకు నీరు అందజేసినామని అన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో రైతులకు లిఫ్ట్ నుండి పైపుల ద్వారా నీరు అందించినప్పటికీ మాటిమాటికి పైపులు పాడవుతున్న సందర్భంలో రెండున్నర కిలోమీటర్ల మేరకు నూతన పైప్ లైన్లు వేయించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీరు అందించిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వాన్నిదని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు, గూడెం లిఫ్ట్ మంజూరులో, నిర్మాణంలో ఎవరి ప్రమేయం లేదు ఇది కేవలం దివాకర్ రావు ఘనత అని అన్నారు. వర్షానికి విద్యుత్ వైర్లు, పరికరాలు మాటిమాటికి పాడవుతున్న సందర్భంలో 1 కోటి 59 లక్షల రూపాయలతో వైర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు వర్షపు నీటిలో తడిచి పాడవకుండా బిల్లింగ్ కూడా మంజూరు చేయించడం జరిగింది అని అన్నారు.
ఇప్పుడు రైతులకు నీరు అందక తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఎమ్మెల్యే చోరువ తీసుకొని నీటిని రెండో పంటకు తక్షణమే నీటిని అందించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో పంటలు ఎండిపోయాయి అని బీజేపీ పార్టీ నాయకులు అవగాహన లేకున్నా విమర్శలు చేస్తున్నారని, తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులకు నీరు అందించిన విషయం రైతులందరికీ తెలుసని తెలిపారు. దండేపల్లి లక్షెట్టిపేట మండలాల రైతుల ప్రయోజనాల కోసం రెండో పంటకు తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ నల్మాస్ కాంతయ్య , దండేపల్లి మండల అధ్యక్షులు చుంచు శ్రీనివాస్, లక్షెట్టిపేట మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షుడు పదం శ్రీనివాస్, లక్షేట్టిపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్, దండేపల్లి మాజీ వైస్ ఎంపీపీ అనిల్ , మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్త లుతదితరులు పాల్గొన్నారు.
