Farm collectoter :   తిరిగి ఇచ్చేశారు

Farm collectoter :   తిరిగి ఇచ్చేశారు

  • మడిలోకి దిగి..  నారు చేతబట్టి..
  • నలుగురితో కలిసి..  నాట్లు వేసి
  • భళా  కలెక్టరన్నా.. వెంకన్న  

తిరుపతి ప్రతినిధి (ఆంధ్ర ప్రభ)

సమాజం చదివించింది. ఈ సమాజానికి తిరిగి ఇవ్వాల్సిందే.. శ్రీమంతుడి (Srimantudu Cinema)  సినిమా స్టయిల్​ లో.. తిరుపతి కలెక్టర్​ వెంకటేశ్వర్​  (Tirupati Collector) స్పందించారు. రోడ్డు పక్కన పొలంలో.. నాట్లు వేస్తున్న.. ఊరి జనాన్ని చూడగానే ఆయనలోని అంతర్లీన   రైతన్న నిద్ర లేచాడు. కారు దిగాడు. మడిలోకి వెళ్లి..  నారు చేతపట్టి .. నలుగురిలో తాను ఒకడిగా నాట్లు వేశాడు. ఆయన ఎవరో కాదు.

  ఆయన ఓ ఐఏఎస్ ఆఫీసర్​.  ఒక జిల్లాకు కలెక్టర్.. జిల్లా కార్యనిర్వాహక న్యాయాధికారి,  ఆయన చుట్టూ నిత్యం పదుల సంఖ్యలో అధికారుల గుంపు.  ఏం చేయాలన్నా ఇట్టే జరిగిపోతుంది. కానీ ఆయనలో తాను జిల్లా కలెక్టర్ ని అనే అధికార దర్పం ఇసుమంతైనా ఉండదు. అందరిలో ఒకరిలాగా కలిసిపోతారు. ప్రజల కోసం తపిస్తారు.

జనం  కష్టం తెలుసుకొనేందుకు నిత్యం పరిగెడుతుంటారు. నిత్యం ప్రజల కోసం పనిచేస్తుంటారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు. ఆయన ఎవరో కాదు ప్రజలందరి మనిషి  ( Farm collector) కలెక్టర్ వెంకటేశ్వర్ (Venkateswar) . తాజాగా బుధవారం సూళ్లూరుపేట (Sullurupet) నియోజకవర్గంలో కలెక్టర్ పర్యటన సందర్భంగా ఆసక్తికర సమావేశం జరిగింది.

మార్గమధ్యలో పెళ్లకూరు మండలం దిగువ చావలి (Diguva chavali)  వద్ద పొలంలో రైతులు వరినట్లు వేస్తూ కనిపించారు. దీంతో కలెక్టర్ కారు దిగి నాట్లు వేసే మడి వైపు నడిచారు. ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ  (Mla veluvala vijayasri) తో కలిసి మడిలోకి దిగారు. వరి నారు చేతబట్టి నాట్లు వేశారు.  దిగువచావలి గ్రామానికి తన శ్రమను  తిరిగి ఇచ్చేశారు.

Leave a Reply