అవి నిజం కావు…

అవి నిజం కావు…

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఇజ్రాయోల్, ఇరాన్ యుద్దం సమయంలో కొన్ని ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్దం ప్రారంభం అయినప్పటి నుంచి దుబాయ్‌పై క్షిపణుల దాడులు, టెహ్రాన్‌లో పేలుళ్లు, గల్ఫ్ దేశాల్లో భవనాలు కూలిపోతున్నాయంటూ, ఇలా అనేక వీడియోలు, ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న వీడియోలు నకిలీ వీడియోలుగా పీటీఐ ఫ్యాక్ట్‌ చెక్‌ చేసి తెలిపింది. ఇరాన్‌ అధినేత అయతుల్లా అలీ ఖమేనీ ఇంకా బతికే ఉన్నారని పేర్కొంటూ ఆయన ప్రసంగ వీడియోను కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దుబాయిపై ఇరాన్ దాడి చేయక ముందు ఆ దేశంపై ఇరాన్ దాడి చేసినట్టు ఏఐ సాయంతో రూపొందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోకి కోట్లల్లో వ్యూస్, లక్షలకు పైగా లైక్స్‌ వచ్చాయి.

అరబ్‌ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ దాడుల కారణంగా అమెరికన్‌ సైనికులు కన్నీటి పర్యంతమవుతున్నట్లుగా రూపొందించిన మరో ఏఐ వీడియో క్లిప్‌ నకిలీదని పీటీఐ నిర్ధారించారు. ఇలా మొత్తం 14 ఫేక్‌ వీడియోలను ఫ్యాక్ట్‌ చెక్‌ గుర్తించింది. యుద్ధాలు, సైనిక ఘర్షణలు జరిగినప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తుంటారని పీటీఐ స్పష్టం చేసింది. ఇలాంటి నకిలీ వీడియోలను నమ్మి మోసపోవద్దని సూచించింది.

Leave a Reply