సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

ఆంధ్ర‌ప్ర‌భ,వెబ్ డెస్క్ : మీ బండిపై పెండింగ్ చలాన్లు ఉన్నాయా, అయితే 80 శాతం డిస్కౌంట్‌తో క్లియర్ చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చెక‌ర్లు కొడుతున్నాయి. ఈనెల 14న రాష్ట్రంలో నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని.. ఆ రోజున పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకునేందుకు గొప్ప అవకాశం అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారు. ఆస‌లు ఇది నిజ‌మా.. లేక త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నరా అనే ప్ర‌శ్న అందరిలో ఉంది. ఈ సువర్ణావకాశం మిస్ కావొద్దని కొంద‌రు ఫెండిగ్ చ‌లాన్లు క్లీయ‌ర్ చేసుకుందామ‌ని లోక్ అదాల‌త్ వెళ్లి జోక‌ర్లు అవుతున్నారు.

అయితే వైర‌ల్ అవుతున్న వీడియోలపై సీపీ స‌జ్జ‌నార్ మండిప‌డ్డారు. పోలీస్ శాఖ, ప్రభుత్వం నుంచి ఎలాంటి డిస్కౌంట్ ప్రకటించలేదని ట్విట్టర్ వేదికగా అంద‌రి అనుమానాల‌కు చెక్ పెట్టారు. కొందరు కావాలనే వ్యూస్ కోసం తప్పుదోవ పట్టించేవిధంగా వీడియోలు పోస్టు చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారని ఫైరయ్యారు.

ఫేమస్ అయ్యేందుకు ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారని.. అలాంటి వీడియోలను ఎవరూ నమ్మి మోస‌పోవ‌ద్ద‌ని సూచిస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని సజ్జనార్ హెచ్చరించారు. కాగా ఒకవైపు త‌ప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న‌వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. మ‌రోవైపు రాయితీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.

Leave a Reply