- ఎమ్మెల్యే కోటం రెడ్డి హత్యకు కుట్ర
- వెలుగులోకి రౌడీషీటర్ల ఢీల్
( ఆంధ్రప్రభ, నెల్లూరు) : నెల్లూరు (Nellore) లో ఫ్యాక్షన్ రాజకీయాలు తెరమీదకు వచ్చాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (KotamReddy SridharReddy) హత్యకు భారీ సుఫారీ సమాచారం కలకలం సృష్టించింది. రాజకీయవర్గాల్లో కలవరం సృష్టించింది. ఈ మేరకు ఓ వీడియో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అంటూ రౌడీషీటర్ల సంబాషణలు వెలుగు చూశాయి. ఆయన్ను చంపేందుకు ఐదుగురు రౌడీషీటర్లు (RowdySheeters) మాస్టర్ ప్లాన్ వేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (MLA KotamReddy SridharReddy) హత్యకు పక్కా ప్లాన్ వేసినట్లు సమాచారం బయటకు రావడంతో సంచలనం చెలరేగింది. “చంపితే డబ్బే డబ్బు” అంటూ రౌడీషీటర్ల సంభాషణలతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఎమ్మెల్యే ప్రాణాలకు ముప్పు ఉందన్న ఆందోళన నెలకొంది.