AP | రామగిరిలో తీవ్ర ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ బాహాబాహీ

  • రెండు వాహనాలు ధ్వంసం
  • ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలోనే ఘర్షణ
  • పోలీసుల ఆధీనంలో రామగిరి
  • సెక్షన్ 144 అమలు


(ఆంధ్రప్రభ, శ్రీ సత్యసాయి బ్యూరో) : శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నాయకులు, కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈ పరస్పర దాడిలో ఇరుపార్టీల వాహనాలు పూర్తిగా ధ్వంసమ‌య్యాయి. ఈ సమాచారంతో జిల్లా ఎస్పీ వి.రత్న హుటాహుటిన రామగిరికి చేరుకున్నారు. వైసీపీ, టీడీపీ వర్గాలు పరస్పరం రాడ్లు, కర్రలతో దాడి చేసుకున్నట్టు సమాచారం.

ఈ ఘర్షణలో రెండు వాహనాలు ధ్వంసం కాగా.. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. గురువారం రామగిరి ఎంపీపీ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ ఘర్షణ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *