Telangana | రైల్వేస్టేషన్ లో విస్తృత తనిఖీలు

Telangana | రైల్వేస్టేషన్ లో విస్తృత తనిఖీలు


Telangana | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ రైల్వేస్టేషన్ (Warangal Railway Station) లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ లో 12మంది మృతిచెందిన నేపథ్యంలో జి ఆర్ పి సిఐ పి.సురేందర్ ఆధ్వర్యంలో గురువారం వరంగల్ రైల్వే స్టేషన్ లోని 4 ప్లాట్ ఫారంసును, ప్రయాణికులను, వారి బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి వ్యక్తి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సిఐ (CI) మాట్లాడుతూ… అనుమానాస్పద వ్యక్తులు కనిపించినచో వెంటనే 100, జి ఆర్ పి ఆర్ పి ఎఫ్ పోలీసులకు, సంబంధింత పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రయాణికులు (Passengers) అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరినీ నమ్మవద్దని, అనుమానాస్పదంగా కనిపించినా, అనుమానస్పదంగా రైల్లో కదలికలు అగుపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ ప్రయాణికులను కోరారు.

Leave a Reply