పేలిన కారు బాంబు
అనేక మందికి గాయాలు..
ఢిల్లీ సర్కారు హై అలెర్ట్.
(ఆంధ్రప్రభ, ఢిల్లీ ప్రతినిధి)
దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. సోమవారం సాయంత్రం చారిత్రాత్మక ఎర్ర కోట సమీపంలో పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వం అలెర్ట్ అయింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ లో ఈ ఘోరం జరిగింది. సాయంత్రం 6.30 గంటలకు ఎర్రకోట బయట ఓ కారులో ఈ పేలుడు సంభవించింది.

