ఆర్అండ్‌బీ అధికారుల‌కు వివ‌ర‌ణ‌

ఆర్అండ్‌బీ అధికారుల‌కు వివ‌ర‌ణ‌

నిజాంపేట, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లా నిజాంపేట(Nizampet) మండల కేంద్రంలో ఈ రోజు కేంద్ర బృందం ప‌ర్య‌టించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లతో పాటు నందిగామ 765 డీజీ బ్రిడ్జి(765 DG Bridge), నిజాంపేట మాల్క చెరువు వద్ద ఉన్న బ్రిడ్జి పూర్తిగా దెబ్బ తినడం వల్ల వాటిని కేంద్ర బృందం(Central Team) సభ్యులు పరిశీలించారు. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న బ్రిడ్జి వివరాలను ఫోటో రూపంలో ఆర్అండ్‌బీ(R&B) అధికారుల బృందానికి వివ‌రించారు.

భారీ వర్షాలకు నిజాంపేట మండలానికి జ‌రిగిన‌ ఆస్తి నష్టాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్(Rahul Raj) కేంద్ర బృందం సభ్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, త‌హసిల్దార్ శ్రీనివాస్(Srinivas), వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఆర్ఐ ప్రీతి, ఇమాద్, మెదక్ విద్యుత్ డివిజన్ ఎస్పీ, టీఈ, ఏడి, ఏఈలు, ఆర్ అండ్ బీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply