పీఎం విశ్వకర్మ ఎగ్జిబిషన్‌ను ప్రారంభం…

పీఎం విశ్వకర్మ ఎగ్జిబిషన్‌ను ప్రారంభం…

బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : స్థానిక వృత్తి కళాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం విశ్వకర్మ పథకంపై అవగాహన కల్పించేందుకు స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ ఎగ్జిబిషన్‌ను బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సాంప్రదాయ చేతివృత్తుల వారు (వడ్రంగులు, కమ్మరులు, కుమ్మరులు మొదలైన 18 రకాల వృత్తుల వారు) ఆర్థికంగా ఎదిగేందుకు, వారికి ఆధునిక పరికరాలు, శిక్షణ అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం అని విశాఖపట్నం ఎంఎస్ఎంఈ డిఎంఓ అసిస్టెంట్ డైరెక్టర్ కెఎల్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, సాంప్రదాయకంగా తమ చేతులతో పనిముట్లు, సామాగ్రితో కష్టపడి ఏదో ఒకటి సృష్టించే కోట్లాది విశ్వకర్మలు ఈ దేశ నిర్మాతలు. కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరులు, వడ్రంగులు, శిల్పులు, చేతివృత్తులు, తాపీ మేస్త్రీలు వంటి అసంఖ్యమైన వ్యక్తుల జాబితా మన దగ్గర ఉందని, కోట్లాది విశ్వకర్మల జీవితాల్లో పీఎం విశ్వకర్మ మార్పులు సముద్రాన్ని తీసుకురానున్నదని, విశ్వకర్మలు మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వారని, వారికి తక్కువ వడ్డీకే రుణాలు, నైపుణ్య మెరుగుదల శిక్షణ అందించడం ద్వారా బాపట్ల జిల్లాలో వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

ఈ ఎగ్జిబిషన్‌లో వివిధ చేతివృత్తుల వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. అలాగే పథకానికి ఎలా నమోదు చేసుకోవాలో వివరించే స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వై రామకృష్ణ, ఎంఎస్‌ఎంఈ శాఖ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply