వ్యాపారవేత్తగా ప్రొఫైల్ పిక్ పెట్టిన యువకుడు
హైదరాబాద్‌కు చెందిన లేడీ డాక్టర్‌కు వల
టర్నోవర్ కోట్లలో ఉంటుందని ఆశలు
బిజినెస్‌మెన్‌పై ఆశపెంచుకున్న డాక్టరమ్మ
వాట్సాప్ కాలింగ్‌తో పరస్పరం పరిచయాలు
నమ్మింది.. తనను తాను అర్పించుకుంది
అంతా అయ్యాక ప్లేటు తిప్పేసిన మోసగాడు
చికాగోలో తల్లి ఆరోగ్యం బాగోలేదంటూ నాటకం
అకౌంట్స్ సీజ్ చేశారని బూటకపు మాటలు
డాక్టరమ్మ నుంచి ₹11 లక్షలు కాజేసిన చీటర్
పెళ్లి పేరుతో బురిడీకొట్టించిన యువకుడు
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : పెళ్లి సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వధువు, వరుడు నేరుగా చూసుకుని.. కాబోయే పెళ్లి కబుర్లతో ఒకరినొరరు బురిడీ కొట్టించే కొత్త కథలు జనాన్ని నవ్విప్తున్నాయి. ఈ చీటింగ్ వ్యవహారంలో మోసపోయేది స్థితిమంతులు.. విద్యావంతులే కావటం విశేషం. ఔను డబ్బుపై మితిమీరిన ఆశతో.. ప్లాన్ మీద ప్లాన్ వేసి దగాపై దగా చేస్తున్న మోసగాళ్ల కథల్లో.. ఇటీవల హైదరబాద్‌లో మరో వినూత్న కథ వెలుగులోకి వచ్చింది. ఓ ప్రబుద్ధుడు మ్యాట్రి మోని వెబ్సైట్లో ఓ అందమైన డాక్టర్‌ను పరిచయం చేసుకున్నాడు. తానొక మిలినియర్ అని.. తన టర్నోవరు లెక్కలు తనకే తెలియవని నమ్మించాడు. ఇంకేముందీ అతడు పెళ్లి చేసుకుందాం రా! అని ఊరించాడు. ఆ ఊరింతలకు ఆ లేడీ డాక్టర్ ఎగిరి గంతులేసింది. ఊహల్లోకి వెళ్లిపోయింది. ఈ మెడికల్ ప్రాక్టీస్ కంటే.. బిజినెస్ మెన్‌తో జాలీగా.. హ్యాపీగా ఖుఫీ ఖుషీగా గడపాలనే ఉబలాటం తారాస్థాయికి చేరింది. ఇంతలోనే ఈ కథ అడ్డంతిరిగింది. అడ్డంగా మోసగాడి చేతికి చిక్కింది. ₹11 లక్షలు అర్పించి.. ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించింది. సైబర్ క్రైమ్ పోలీసులను, జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి తన గోడు చెప్పుకుంది.
నమ్మి మోసపోయిన లేడీ డాక్టరమ్మ..
జూబ్లీహిల్స్ కు చెందిన ఓ ఓ లేడీ డాక్టర్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తోంది. ఇటీవల పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో ప్రకటన ఇచ్చింది. ఓ వ్యక్తికి చెందిన వివరాలను ఆ సంస్థ అందజేసింది. యువతి నెంబర్‌ను ఆ వ్యక్తికి ఇచ్చారు. ఇంతవరకు సీన్ బాగానే జరిగింది. అసలు తతంగం ఇక్కడి నుంచే మొదలైంది. ఆ తర్వాత అంటే జనవరి 30 న వారిద్దరూ వాట్సాప్ చాటింగ్ లో మాట్లాడుకుంటున్నారు. అచ్చికబుచ్చికాలు జరిగాయి. ఇక ఈ పెళ్లికొడుకు కొత్త డ్రామా తెరలేపాడు. తన తల్లి చికాగోలోని నార్త్ వెస్టర్న్ ఆసుపత్రిలో డాక్టర్‌గా పని చేస్తోందని నమ్మించాడు. తమకు పెద్ద ఎత్తున వ్యాపారాలు ఉన్నాయని నమ్మబలికాడు. ఒక రోజు తన బ్యాంక్ అకౌంట్స్ ను ఆదాయపు పన్ను శాఖ సీజ్ చేసింది అంటూ అతడు బిక్కమొహం వేశాడు. త్వరలోనే ఈ కేసు నుంచి బయటపడతానని గొప్పలు పోయాడు. ఆ లేడీ డాక్టర్ నిజమేనని నమ్మింది. త్వరలో మా మదర్ ఇండియాకు వచ్చిన తర్వాత పెళ్లి గురించి ఫైనల్ చేసుకుందామని చెప్పాడు. ఆ మాటలు వెనుక అసలు నిజాన్ని లేడీ డాక్టర్.గుర్తించలేకపోయింది .
పెళ్లి వలలో.. ఊహలు గుసగుస .
అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది. అతడికి పంపింది ఈ లేడీ డాక్టర్ కొన్ని తన ఫోటోలు పంపించింది. ఇటీవల ఆమెకు ఫోన్ చేసి తనకు అర్జెంట్‌గా కొంత డబ్బు కావాలని చెప్పాడు. ఐటీ శాఖ దాడులతో బ్యాంక్ అకౌంట్స్ సీజ్ అయ్యాయని నమ్మబలికాడు. పాన్ కార్డు సహా ఐటీ అధికారులు తీసుకువెళ్లారని కొత్త డ్రామాను క్రియేట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి సూచించిన పలు నెంబర్లకు విడత వారిగా దాదాపు రూ.10.94 లక్షలు పంపించింది. త్వరలో డబ్బులు పంపిస్తానని నమ్మించాడు.ఆ తర్వాత ఫిబ్రవరి 21న తల్లి అమెరికా నుంచి వచ్చాక ఎంగేజ్మెంట్ చేసుకుందమని చెప్పాడు.
ఫొటోలు మార్పింగ్ చేస్తానని బెదిరింపులు..
మళ్లీ వీరిద్దరి సీన్ మారిపోయింది.ఈ డాక్టరమ్మ ఫోన్ కాల్ కు రెస్పాండ్ కావటం మానేశాడు. ఓ రోజు ఫోన్ లిఫ్ట్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన యువతి, తాను ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని కోరింది. తీవ్ర పదజాలంతో ఆమెని దూషించాడు. అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయిస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇంకో రూ.10 లక్షలు ఇస్తే మార్ఫింగ్ చేసిన ఫోటోలు డిలీట్ చేస్తానని లేకుంటే లైఫ్ నాశనం అవుతుందని బెదిరించాడు. దీంతో ఏ చెయ్యాలో ఆ యువతికి తెలీలేదు. ఆందోళనకు గురైన యువతి జరిగిన విషయాన్ని ఫ్యామిలీ సభ్యులకు వివరించింది. షాదీ డాట్ కామ్ ప్రతినిధులకు ఫిర్యాదు చేయగా, అక్కడ కూడా తప్పుడు వివరాలు ఇచ్చినట్లు తేలింది.చివరకు బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదండీ .. డబ్బులు కొట్టేసిన షాదీ కథ..