Examination | విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని మోడీ

Examination | విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని మోడీ
- ఒత్తిడిని అధిగమిస్తేనే సత్ఫలితాలు
Examination | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఒత్తిడిని అధిగమిస్తేనే సత్ఫలితాలు వస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులకు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పరీక్షల ముందు ఒత్తిడిలో ఉండే విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపేలా ‘పరీక్షాపే చర్చా’ కార్యక్రమం ద్వారా వారితో సంభాషించారు.
ఈ ఏడాది కూడా ఆయన విద్యార్థులతో ముచ్చటించి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను శుక్రవారం మోడీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేస్తూ, ‘పరీక్షలను సానుకూలంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం గురించి విద్యార్థులతో అద్భుతమైన చర్చ జరిగింది’ అని పేర్కొన్నారు. పౌష్టికాహారం తింటూ తగినంత నిద్రపోవాలని సూచించారు. విద్య ద్వారానే జీవిత, వృత్తిపర నైపుణ్యాలు సాధ్యమవుతాయని తెలిపారు. ఈ కాలం విద్యార్థులకు టెక్నాలజీ ఎన్నో సమకూరుస్తోందని, ఏఐ సాయంతో సమస్యలను వేగంగా పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు.

