Ex Union Minister | పార్టీలకతీతంగా పశ్చిమలో పాలన…

Ex Union Minister | పార్టీలకతీతంగా పశ్చిమలో పాలన…

  • నిత్యం సమస్యల పరిష్కారమే లక్ష్యం..
  • ప్రతి డివిజన్ లో సుజనా మిత్ర కోఆర్డినేటర్లు..
  • సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నాం..
  • పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి..

Ex Union Minister | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : రాజకీయాలకు అతీతంగా పశ్చిమ నియోజకవర్గంలో సుపరిపాలన కొనసాగుతోందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు మాజీ కేంద్రమంత్రి యలమంచిలి సత్యనారాయణ (సుజనా) చౌదరి పేర్కొన్నారు. గడిచిన 15 నెలల నుండి సృజన మిత్ర కోఆర్డినేటర్ల ద్వారా నియోజకవర్గంలోని ప్రజలను నేరుగా కలుస్తూ సమస్యలను స్వీకరిస్తూ వాటికి పరిష్కారం మార్గాలు చూపిస్తున్నామన్నారు.

సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మరోసారి ప్రజాదర్బార్ నిర్వహించామన్న ఆయన కార్యాలయానికి నిత్యం వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వస్తున్నామన్నారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ ను మంగళవారం ఎమ్మెల్యే సుజనా చౌదరి నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలు తీసుకోవటమే కాకుండా వారి సమస్యను ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగి తెలుసుకున్నారు.

Ex Union Minister

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా దర్బార్ ఏర్పాటు చేయకముందు నుంచి కూడా తన నియోజకవర్గంలో ప్రజల సమస్యల కోసం సుజనా మిత్ర వ్యవస్థను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. సుజనా మిత్ర కోఆర్డినేటర్లు నిత్యం ప్రతి డివిజన్ లో తిరుగుతున్నారనీ, తన నియోజకవర్గంలో గత 15 నెలల నుంచి ప్రజల వద్ద నుంచి సుజనా మిత్రలు సమస్యలు స్వీకరిస్తూ, పరిష్కారం కోసం కృషి చేస్తున్నారన్నారు. అయితే ప్రతి నియోజకవర్గంలో ప్రజాదర్బార్ నిర్వహించాలని సీఎం చెప్పారనీ, అందుకే ఇక్కడ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.

గత 15 నెలల నుంచి కూడా ప్రజల వద్దకు త‌మ ప్రతినిధులు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారనీ, ఎవరైనా సమస్యలతో తన కార్యాలయానికి వస్తే పార్టీలకు అతీతంగా సమస్యలు పరిష్కారం చేస్తాననీ స్పష్టమైన హామీ ఇచ్చారు. అనంతరం ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురాం, జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply