EX MLA | అధైర్య పడొద్దు.. అండగా ఉంటా..

EX MLA | అధైర్య పడొద్దు.. అండగా ఉంటా..

  • డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్

EX MLA | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : రాబోయేది మన రోజులేనని.. అధైర్య పడకుండా ఉండాలని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. ఇవాళ‌ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచి, వార్డు సభ్యులుగా పోటీ చేసి ఓటమి చెందిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు, కార్యకర్తలకు మనోధైర్యం కల్పిస్తూ మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయన పర్యటించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… గెలుపు ఓటములు సహజమ‌ని, ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యల కోసం పోరాటాలు చేయాలని సూచించారు. బీఆర్ఎస్ తరఫున గెలిచిన వార్డు సభ్యులు ఎల్లవులు ఉపేందర్, కొమ్మిరే ఉపేంద్ర, దూరు శ్రీపాల్, భేతమల్ల శోభలను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఉగ్గంపల్లి నూతన సర్పంచ్ గా గెలుపొందిన ఆయు పాషాను కార్యకర్తలు, నాయకులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మైదం దేవేందర్, మాజీ మండల యూత్ అధ్యక్షుడు బండి రమేష్, మాజీ సర్పంచ్ బండ బిక్షం రెడ్డి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ మాజీ చైర్మన్లు మిర్యాల వెంకన్న, కాలసాని వెంకటరెడ్డి, బొల్లం రమేష్ బాబు, కొత్త రవీందర్ రెడ్డి, మంద వెంకన్న, సుంకరి చంద్రయ్య, కొండబత్తిని కిరణ్ కుమార్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply