ప్రధానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధం

ప్రధానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధం
( ఓర్వకల్లు , ఆంధ్రప్రభ): ప్రధాని నరేంద్ర మోదీ (NarendraModi) పర్యటన నేపథ్యంలో ఏపీ గవర్నర్ నజీర్ అహ్మద్, సీఎం నారా చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ (NaraLokesh), బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ (Madhav) గురువారం కర్నూలుకు చేరుకున్నారు.

ఓర్వకల్లు విమానాశ్రయంలో ఈ నేతలకు జిల్లా ఇన్చార్జి మంత్రి, అధికారులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఆతిథ్య వాతావరణం నెలకొంది. కాసేపట్లో ప్రధాని మోదీ అక్కడికి చేరుకోనుండగా, ఆయనకు స్వాగతం పలకనున్నారు.

తరువాత ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ లో సుండిపెంటకు చేరుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్తారు. మధ్యాహ్నం 2.20 గంటలకు కర్నూలులో జరగనున్న ‘జీఎస్టీ 2.0’ సభలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.




