ప్రతి ఒక్కరూ సనాత ధర్మాన్ని పాటించాలి

ప్రతి ఒక్కరూ సనాత ధర్మాన్ని పాటించాలి

  • శ్రీ కమలానంద భారతి స్వామీజీ

కుంటాల, ఆంధ్రప్రభ ; ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం వైపు అడుగులు వేయాలని శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ అన్నారు కుంటాల మండలంలోని కల్లూరు శ్రీనివాస కన్వెన్షన్ హాల్ ఆయన పలు ప్రవచనాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సనాతన ధర్మంపై ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని సనాత ధర్మం పాటించాలని తెలియజేశారు. హిందూ సాంప్రదాయాల వివరాలను భక్తులకు తెలియజేశారు.

ప్రతి ఒక్కరూ మార్గంలో హిందూ సంప్రదాయాన్ని పాటించాలని మానసిక ప్రశాంతత తోనే ఆధ్యాత్మిక లభిస్తుందని తెలియజేశారు. భక్తులకు పలు ప్రవచనాలు ఇచ్చారు. అంతేకాకుండా హిందూ సంప్రదాయాలను భవితరాలకు అందేలా చూడాలని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో మహిళలు కుంకుమార్చన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంట వార్ దశరథ్ లక్ష్మణ్ పటేల్, గుద్దేటి నరయ్య, పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply