ఆక్ర‌మ‌ణ‌ల‌తోనే.. పోతరాజు కుంటలో నీరు

ఆక్ర‌మ‌ణ‌ల‌తోనే.. పోతరాజు కుంటలో నీరు

కలెక్టర్‌కు పూర్తి వివరాలు అందజేస్తా : ఆర్డీవో


చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మున్సిపాలిటీ పరిధి జాతీయ రహదారి ఎన్ హెచ్ 65 రైల్వే అండర్ పాస్ వద్ద ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నీరు నిలుస్తుండడంతో నలగొండ (Nalagonda) ఆర్డీవో మేక అశోక్ రెడ్డి సోమ‌వారం ప‌రిశీలించారు. ఆయ‌న వెంట చిట్యాల మున్సిపల్ కమిషనర్ దండు శ్రీనివాస్ చిట్యాల ఇన్చార్జి ఎమ్మార్వో బి.విజయ, నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఉన్నారు.

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కింద నీరు నిలవడంతో గత మూడు రోజుల నుంచి జాతీయ రహదారి పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందన్నారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఎస్డిఆర్ఎఫ్ ఫైర్ మున్సిపల్ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొని మోటార్ల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని బయటికి పంపించడం జరుగుతుందని అన్నారు.

చిట్యాల (chityala) పట్టణానికి సంబంధించిన వర్షపు నీరు జాతీయ రహదారి నుంచి పోతరాజు కుంటకు వెళ్లే విధంగా గతంలో ఎన్ హెచ్ ఏ ఐ వాళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని అయితే పోతరాజు కుంట అక్రమణ‌కు గురికావడం మున్సిపల్ వాళ్లు చెత్త వేయడంతో పోతరాజు కుంట నీరు నిలవకుండా పూర్తిగా కుంగిపోతుంది. దీంతోనే రైల్వే అండర్ పాస్ కింద నీరు నిలుస్తుందన్నారు. పోతరాజు కుంటలో ఉన్న అక్రమాలను తొలగించి నీరు నిలిచే విధంగా పనులను పునరుద్ధరించి శాశ్వత పరిష్కారం చేస్తామని తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు పూర్తి నివేదికను అందజేస్తానని కలెక్టర్ ఆదేశాల ప్రకారం త్వరలోనే చర్యలు చేపడతామని ఆయన అన్నారు.

Leave a Reply