​Eturunagaram | సర్పంచ్‌గా జబ్బ సరోజన ప్రమాణ స్వీకారం

​Eturunagaram | సర్పంచ్‌గా జబ్బ సరోజన ప్రమాణ స్వీకారం

​Eturunagaram | ఏటూరునాగారం, ఆంద్రప్రభ : ఏటూరు నాగారం మండలంలోని శివపురం గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్‌గా జబ్బ సరోజన, ఉప సర్పంచ్‌గా వంగపండ్ల సరిత ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, PACS డైరెక్టర్ వంగపండ్ల రవి హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ అందేలా పాలకవర్గం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply