Eturu Nagaram | ఏటూరు నాగారం, ఆంధ్రప్రభ : ఏటూరు నాగారం గ్రామపంచాయతీ 15వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాగవత్ కిరణ్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా నాగవత్ కిరణ్ మాట్లాడుతూ.. తన గ్యాస్ స్టవ్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రధానంగా గ్రామపంచాయతీలో కోతుల సమస్య విపరీతంగా ఉందని, ఈ సమస్య నిర్మూలనకు ఏటూరు నాగారం గ్రామపంచాయతీ 15వార్డులకు తన సొంత ఖర్చులతో కృషి చేస్తానని, వార్డులో ఉన్న ప్రధాన సమస్యలైన విద్యుత్, రోడ్లు, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. అలాగే నిత్యం ప్రజలతో ఉండి వారి సమస్యలను తీర్చడంలో తమ వంతు సహకారం అన్నివేళలా అందిస్తానని, తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని వార్డు ప్రజల ముందు ప్రతిజ్ఞ చేస్తున్నానన్నారు.
Eturu Nagaram | గెలిపిస్తే.. సమస్యలు పరిష్కరిస్తా..

