పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

అక్టోబర్ 22, ఆంధ్రప్రభ : కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం ఆధ్వర్యంలో కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలో బుధవారం నాడు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కమీషనరేట్‌లోని పోలీసు అధికారులు మరియు సిబ్బందికి రెండు కేటగిరీలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు.


కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్ హాలు నందు జరిగిన ఈ పోటీలలో పోలీస్ కానిస్టేబుల్ నుండి ఏఎస్సై వరకు గల సిబ్బందికి “పని ప్రదేశంలో లింగ వివక్ష” అనే అంశం పై, అలాగే ఎస్సై మరియు ఆ పై స్థాయి అధికారులకు “నేల స్థాయిలో పోలీసింగ్ బలోపేతం చేయడం” అనే అంశం పై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కమీషనరేట్‌కు చెందిన అన్ని పోలీసు స్టేషన్లు మరియు విభాగాల నుండి మొత్తం 117 మంది పోలీసులు ఈ పోటీలో పాల్గొన్నారు.

Leave a Reply