Environment l పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తోడ్పడాలి

Environment l పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తోడ్పడాలి
మచిలీపట్నం , ఆంధ్రప్రభః స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తోడ్పడాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ కోరారు. కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణములోని అన్ని కార్యాలయాల సిబ్బంది అందరు, వివిధ పనుల నిమిత్తం వచ్చే అర్జీదారులు ప్రతి శనివారం ” సైకిల్” లేదా “కాలి నడకన” కార్యాలయమునకు హాజరు కావాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశాల ప్రకారం వాయు కాలుష్యాన్ని తగ్గించి, స్వచ్ఛ మైన గాలి కోసం కృషి చేసే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు తమ వంతు కృషి చేయాలని సూచించారు.
