లార్డ్స్ – భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు ముగిసిన రెండు టెస్టుల్లోనూ బ్యాట్స్‌మెన్‌లదే పైచేయిగా నిలిచింది. ఇరు జట్ల బ్యాటర్లు భారీగా పరుగులు సాధించగా, పలువురు ఆటగాళ్లు సెంచరీలు, అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. ఇక రెండు మ్యాచ్‌ల అనంతరం ఇరు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచాయి.
ఈ నేపథ్యంలో, సిరీస్‌లో కీలకమైన మూడో టెస్ట్ చారిత్రాత్మక లార్డ్స్ (Lords ) మైదానంలో మరికొద్దిసేపట్లో జరగనుంది. ముందుగా టాస్ గెలిచి (toss won ) బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్ (england ).. భారత్ బౌలింగ్ చేయనుంది.
ఇక భారత్ టీమ్ లోకి బూమ్రా (bhumra ) తిరిగి వచ్చాడు.. ప్రసిద్ద కు విశ్రాంతి ఇచ్చారు..
ఈ మ్యాచ్‌కు ముందు లార్డ్స్ పిచ్ ఎలా ఉండబోతోంది, బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందా లేక బౌలర్లు తమ మ్యాజిక్‌తో మ్యాచ్‌ను శాసిస్తారా అనే విషయాలపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
లార్డ్స్ పిచ్ విశ్లేషణ:
మూడో టెస్ట్ కోసం లార్డ్స్ పిచ్ సిద్ధంగా ఉంది. ఈ పిచ్‌ను పరిశీలిస్తే, దానిపై గడ్డి ఎక్కువగా కనిపిస్తోంది. లార్డ్స్ మైదానంలో పిచ్‌పై గడ్డి ఉండటం వల్ల పేస్ బౌలర్లకు చక్కటి స్వింగ్ లభిస్తుంది. అంతేకాకుండా, పిచ్‌పై గడ్డి ఉండటం వల్ల బంతి అసాధారణంగా బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల కారణంగా, తొలిత బ్యాటింగ్ చేసే జట్లకు ఇది కొంత సవాలుగా మారవచ్చు. బంతి విపరీతమైన బౌన్స్, స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
అయితే, మ్యాచ్ సాగే కొద్దీ, పిచ్ పాతబడిన తర్వాత బ్యాటింగ్ చేయడం సులభం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పిచ్‌పై మొదటి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 310 పరుగులుగా నమోదవుతోంది. లార్డ్స్ చరిత్రను పరిశీలిస్తే, ఇక్కడ 344 పరుగులకు మించి లక్ష్యాన్ని ఛేదించిన దాఖలాలు లేవు.
ఇంగ్లండ్ టీమ్ – జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్, బ్రైడాన్ కార్స్, క్రిస్ వోక్స్.
భారత జట్టు – శుభమ్ గిల్, యశస్వీ జైశ్వాల్, రిషబ్ పంత్, కె ఎల్ రాహుల్, కరణ్ నాయర్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జడేజా, సిరాజుద్దీన్, బుమ్రా, అకాశ్ దీప్ ,