Endapalli | ఆటో అదుపుతప్పి బోల్తా..

Endapalli | ఆటో అదుపుతప్పి బోల్తా..

  • డ్రైవర్‌కు గాయాలు

Endapalli | ఎండపల్లి, ఆంధ్రప్రభ : మండలంలో కరీంనగర్–రాయపట్నం హైవేపై ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ గాయపడగా, అక్కడి స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన డ్రైవర్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తిని ఆదిలాబాద్‌కు చెందిన షైక్ మొహమ్మద్‌గా గుర్తించారు. ఖమ్మం నుండి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Leave a Reply