Encounter | బీజాపూర్ లో ఎన్‌కౌంటర్

Encounter | బీజాపూర్ లో ఎన్‌కౌంటర్
ఇద్దరు మావోయిస్టులు మృతి
మరికొంతమందికి గాయాలు
Encounter | చర్ల, ఆంధ్రప్రభ : ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా (Bijapur District) దక్షిణ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరి కొంతమంది మావోయిస్టులు గాయపడినట్లుగా సమాచారం అందుతోంది. ఎన్ కౌంటర్ లో మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీస్ అధికారులు తెలిపారు.
