విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

తొర్రూరు, ఆంధ్రప్రభ : విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామని టీఎస్ ఎన్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ ధరావత్ సికిందర్ డిమాండ్ చేశారు.విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం డివిజన్ కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆర్టిజన్, ఆన్ మ్యాన్, స్పాట్ బిల్లర్స్, పీస్ రేట్ కార్మికులు సమ్మె నిర్వహించారు.ఈ సందర్భంగా సికిందర్ మాట్లాడుతూ…ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలలో దాదాపు 20 వేల మంది ఆర్టిజన్స్ ఏడేళ్లుగా పని చేస్తున్నారని, అంతకుముందు ఈ కార్మికులందరూ 20 ఏళ్లు కాంట్రాక్టు పద్ధతిలోనే విద్యుత్ సంస్థల్లో పని చేశారని గుర్తు చేశారు.

అన్ మ్యాన్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాబట్టి కార్మికుల విద్యార్హతల ఆధారంగా జేఎల్ఎం, జూనియర్ అసిస్టెంట్, సబ్ ఇంజినీర్, ఆఫీస్ సబార్డినేట్ గా కన్వర్షన్ చేయాలని కోరారు. విద్యుత్ శాఖలో ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్ అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తొర్రూరు డివిజన్ చైర్మన్ పసుపులేటి మధు, కన్వీనర్ బంధారపు శ్రీనివాస్,కో చైర్మన్ పి నాగరాజు,కో కన్వీనర్ రమేష్,నాయకులు ప్రకాష్ ఖాజాబీ, జ్యోతి, స్వప్న, ఉపేందర్ సునీల్ సత్తార్ బాషా,హరిప్రసాద్, బంధు శ్రీను, రామకృష్ణ, సందీప్, అశోక్, పుల్లయ్య, మధు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply