Elur | జాతరే జాతర

Elur | జాతరే జాతర
- నల్లమారమ్మ సన్నిధిలో ఎంపీ సందడే సందడి
Elur | ఏలూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏలూరులో జరుగుతున్నజాతర మహోత్సవంలో భాగంగా దక్షిణపు వీధి జాతరలో నల్ల మారెమ్మను ఆదివారం ఉదయం ఎంపీ మహేష్ యాదవ్ దర్శించుకున్నారు. ప్రతి ఏడు సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ జాతర మహోత్సవాలలో ఈసారి సంక్రాంతి పండుగకు తోపాటు జాతరను కూడా కలిపి జరుపుకోవడంలో తాను భాగస్వామ్యం కావడం తన పూర్వజన్మ సుకృతమన్నారు.

ఎంపీ మహేష్ ఈ సందర్భంగా ప్రజలు పాడిపంటలతో తులతూగుతూ, వ్యాపార వాణిత్యాలు అభివృద్ధి చెందుతూ ఫలితంగా ఆర్థిక అభివృద్ధి పొందుతూ, సుఖ సంతోషాలతో ప్రశాంతమైన జీవితం గడపాలని, తన నియోజకవర్గంమైన ఏలూరు జిల్లానే కాకుండా రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని ముందుకు అవసరమైన శక్తియుక్తులను కూటమి ప్రభుత్వానికి ఆ తల్లి అందజేయాలని కోరుకున్నట్లు మహేష్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి, జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు, ఎ.ఎం.సి చైర్మన్ పార్థ సారథి తదితరులు ఎంపీ మహేష్ వెంట ఉన్నారు.

