Electricity | రూ. 5 కోట్లతో సబ్ స్టేషన్ నిర్మాణం…

Electricity | రూ. 5 కోట్లతో సబ్ స్టేషన్ నిర్మాణం…
Electricity | గంపలగూడెం, ఆంధ్రప్రభ : ఉమ్మడదేవరపల్లి, నెమలి, కొణిజర్ల గ్రామాల ప్రజలకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు త్వరలోనే నూతన సబ్ స్టేషన్ అందుబాటులోకి తీసుకువస్తామని నియోజకవర్గ శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మండలంలోని నెమలి గ్రామంలో సబ్ స్టేషన్ ఏర్పాటుకై దాత భూమి అందజేయగా ఆయన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
ఐదు కోట్ల రూపాయల అంచనాతో సబ్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ డిఈ సత్యనారాయణ, ఏడి రామకృష్ణ, ఏఈ శ్రీనివాస్, నిర్మాణ శాఖ ఏడి ప్రభు, సబ్ ఇంజినీర్ కె.వాసు, గ్రామ పార్టీ అధ్యక్షుడు వడ్లమూడి రాజశేఖర్, మాజీ అధ్యక్షుడు బెల్లం మధుసూదన్ రావు, మాజీ జడ్పీటీసీ పామర్తి కొండలరావు, వనమా చిన్న అనంతరామయ్య, మల్లవరపు చైతన్య, తదితరులు పాల్గొన్నారు.
