రక్షణ సైన్యం సమాధుల తోటను పరిరక్షించాలి

రక్షణ సైన్యం సమాధుల తోటను పరిరక్షించాలి
స్థానిక తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేత
బాపట్ల, టౌన్, ఆంధ్రప్రభ : పట్టణంలోని రక్షణ సైన్యం సంస్థకు చెందిన పురాతన సమాధుల తోటను రైల్వే శాఖ స్వాధీనం చేసుకోవద్దని కోరుతూ, బాపట్ల మండల రక్షణ సైన్యం జేఏసీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద జరిగిన సమావేశంలో సాల్వేషన్ ఆర్మీ జేఏసీ మేజర్ వి ఏసు పాదం మాట్లాడుతూ స్థానిక టీసోర్ట్ స్కూల్ పక్కన ఉన్న రక్షణ సైన్యం సమాధుల తోట ప్రదేశంలో రైల్వే ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ నిర్మించేందుకు అనుకూలంగా ఉందని, ఆ స్థలాన్ని కేటాయించాలంటూ రైల్వే శాఖ నోటీసులు ఇవ్వడంపై జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
అనాదిగా బాపట్ల మండలంలోని అనేక రక్షణ సైన్యం సంఘాల సభ్యులు మరణించినప్పుడు అంత్యక్రియల కోసం ఈ తోటనే వినియోగిస్తున్నారని, ఇక్కడ నిర్మాణాలు చేపట్టడం సంఘస్థుల మనోభావాలను దెబ్బతీయడమేనని మేజర్ వి. యేసుపాదం అన్నారు. ఈ విషయంపై ఇప్పటికే సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చామని, నేడు తహశీల్దార్ షేక్ సలీమా ను కలిసి సమస్యను వివరించినట్లు నాయకులు తెలిపారు. ప్రభుత్వ అధికారులు సానుకూలంగా స్పందించి, ఎంతో కాలంగా వినియోగంలో ఉన్న ఈ సమాధుల తోటను తొలగించకుండా, రైల్వే సబ్ స్టేషన్ కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపాలాని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు డా. కాగిత వర, గేరా మణి భూషణ్, ప్రసాద్, దాసరి శ్యామ్ లివింగ్ స్టన్, పళ్లెం జీవన్, కాగిత సుందరదాస్, కోపూరి రత్న ప్రసాద్, మాతంగి డేనియల్, మాతంగి యేసుపాదం, రక్షణ సైన్యం సేవకులు పాల్గొన్నారు.
