ELECTIONS| ఎంపీడీవో, ఎంపీవో సస్పెండ్
- ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం కారణంగా సస్పెన్స్
ELECTIONS| నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించిన నాగిరెడ్డిపేట ఎంపీడీవో లలిత కుమారితో పాటు ఎంపీవో ప్రభాకర్ చారిల(MPO Prabhakar Charila)ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సర్పంచులు, వార్డు సభ్యుల కోసం నామినేషన్ పత్రాలు(Nomination documents) సమర్పించిన లెక్కలను జిల్లా అధికారులకు సమర్పించిన నివేదికలో వ్యత్యాసం ఉంది.
దీంతో బుధవారం ఉదయం 1 గంట సమయంలో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎల్పీవో సురేందర్, ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఎంపీడీవో, ఎంపీవో లు ఇద్దరు కూడా కార్యాలయంలోనూ, లోకల్ గాను అందుబాటులో లేరని, ఆఫిస్ సిబ్బందితో నామినేషన్ పత్రాలను సరిచేసి నామినేషన్ల పత్రాల్లో ఉన్న వ్యత్యాసాన్ని(The difference) సరి చేసి జిల్లా ఆదికారులకు నివేదిక సమర్పించారు. ఎన్నికల వేళ స్థానికంగా ఉండకపోవడంతో పాటు దాఖలైన నామినేషన్ పత్రాల లెక్కల్లో ఉన్న వ్యత్యాసం కారణంగానే ఇద్దరు ఉద్యోగులను సస్పెన్షన్(Suspension) చేస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

