Elections | టెంట్ కింద పోలింగ్..
Elections | అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం మహాదేవపూర్ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు(Elections) వినూత్నంగా జరిగాయి. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేశారు. స్థానిక పాఠశాల గదులు సరిపోయినన్ని లేకపోవడంతో టెంట్(tent) కింద ఎన్నికల నిర్వహణ జరిగింది.
గ్రామంలోని ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్థానిక ఎన్నికల అధికారులు తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేసి పోలింగ్ బూతులను సిద్ధం చేశారు. దీంతో ఓటర్లు ఎలాంటి అసౌకర్యం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారుల పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ(polling process) ప్రశాంతంగా సాగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు, ఎన్నికల సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

